తొలి శుభోదయం సింగరాయకొండ:-

నాలుగవ తరగతి నుండి ఐదవ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థుల కొరకు నిర్వహించే డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో సహృదయ ఫౌండేషన్ సహకారంతో, ఫ్రెండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శానంపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధి, ప్రధానోపాధ్యాయిని జి.వీరమ్మ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సరైన మార్గదర్శకం లేకపోవడం వల్ల అవకాశాలు కోల్పోతున్నారని, ఇలాంటి కార్యక్రమాలు వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని అభిప్రాయపడ్డారు.శానంపూడి గ్రామ రెవెన్యూ అధికారిని తిరుమల తమ ప్రసంగంలో గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించడం ద్వారా విద్యార్థులు మంచి క్రమశిక్షణ, నాణ్యమైన విద్య మరియు ఉన్నత భవిష్యత్తును సాధించే అవకాశాలు పొందుతారని తెలిపారు. తాను కూడా గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థినినీ అని చెప్పి, విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రులు, గ్రామం మరియు దేశానికి గర్వకారణంగా నిలవాలని సూచించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని షేక్.ఉస్మాభాను, ఉపాధ్యాయులు ఈతముక్కల చిట్టిబాబు పాల్గొనగ, న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్య మాత్రమే భవిష్యత్తును మార్చే శక్తి అని, విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకొని ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.ఇలాంటి సేవా కార్యక్రమానికి సహకరించిన సహృదయ ఫౌండేషన్ చైర్మన్ బిందు తాడివాక వారికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *