తొలి శుభోదయం సింగరాయకొండ:-

సింగరాయకొండ లోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ లో సంక్రాంతి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగినాయి. సంప్రదాయ వేషధారణలతో తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హై స్కూలు కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టమైనదని,మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసే గొప్ప పండుగని అన్నారు. విద్యార్థులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హై స్కూల్ ప్రిన్సిపాల్ సైకం శ్రీవిద్య చక్కటి వేషధారణలతో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం భోగిమంటలతో హరిదాసు పాటలతో ఆహుతులను అలంకరించారు. ఈ కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *