తొలి శుభోదయం ప్రకాశం :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లాలోని అన్ని చర్చిల వద్ద ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు (BB) ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు నిర్వహించుకునేలా పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ప్రధాన చర్చిల వద్ద పోలీస్ సిబ్బందిని మోహరించి, నిరంతర గస్తీ, నిఘా చర్యలు చేపట్టారు. చర్చిల పరిసర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ, అనుమానితులపై పర్యవేక్షణ కొనసాగిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రకాశం జిల్లా పోలీసులు కోరారు.