ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా చిమకుర్తి పట్టణంలోని NSP కాలనీ శివార్లలో అక్రమ జూదంపై దాడి నిర్వహించింది.

తొలి శుభోదయం ప్రకాశం:-

చిమకుర్తి సీఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చేపట్టిన ఈ దాడిలో అక్రమంగా జూదం ఆడుతున్న 7 మందిని పట్టుకొని, వారి వద్ద నుండి రూ.37,700/- నగదును స్వాధీనం చేసుకున్నారు.ప్రజల జీవన విధానాన్ని భ్రష్టుపట్టించే జూదం వంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. జూదం నిర్వహించే వారిపై మరియు జూదానికి పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.తమ పరిసర ప్రాంతాల్లో జూదం, మద్యం, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఏమైనా సమాచారం ఉంటే వెంటనే స్ధానిక పోలీసులకు లేదా డయల్ 112 / 100 కు తెలియజేయాలని ప్రజలను కోరారు. జిల్లాలో నేర రహిత సమాజం దిశగా ఇలాంటి దాడులు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *