తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
గుడ్లూరు మండలంలోని చేవూరు గ్రామంలో నిన్న వెలుగులోనికి వచ్చిన బాల్య వివాహం పై ఒంగోలు .పి.డి. నాగమణి ఆదేశాల మేరకు చేవూరు జడ్పీహెచ్ స్కూల్ లోని విద్యార్థినీ .విద్యార్థులకు. అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సఖి వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ జ్యోతి సుప్రియ మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరమని. బాల్యవాహాలను ప్రోత్సహించిన వారికి. బాల్యవాలకు హాజరైన వారికి. బాల్య వివాహం. జరిపించిన తల్లిదండ్రులకు .పెద్దలకు చట్టరీత్యా కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని .అనంతరం కుటుంబం ఎదురుకునే సమస్యలను విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది. ముఖ్యంగా చిన్నవయసులో వివాహం చేసుకోవడం వలన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని. శారీరకంగా. మానసికంగా .ఎదుగుదల ఉండదని. గర్భవతి అయిన సమయంలో తల్లి .బిడ్డ .ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని తెలియపరిచారు. అంతేకాకుండా చిన్న వయసులో చట్టరీత్యా నేరస్తులుగా పరిగణించబడితే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు రావని. కొన్ని సందర్భాలలో తెలిసి చేసిన తెలియక చేసిన శిక్షార్హులవుతారని . చట్టాలపై అవగాహన కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సఖి వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ జ్యోతి సుప్రియ. ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత. సూపర్వైజర్ కామేశ్వరి. జడ్పీహెచ్ స్కూల్ టీచర్స్. ఎంవి శోభ రాణి. ఆదిలక్ష్మి. జ్ఞాన ప్రసన్న. అంగన్వాడీ కార్యకర్తలు కొమరగిరి సునీత.నళిని. హెలెన్. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు