తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ జరుగుమల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించి, స్టేషన్లోని విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సీఐ పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులు, కేసులకు సంబంధించిన సీడి (Case Diary) ఫైళ్లను సవివరంగా తనిఖీ చేశారు. కేసుల పురోగతి, దర్యాప్తు నాణ్యత, రికార్డు నిర్వహణ విధానాలపై సిబ్బందితో చర్చించారు.అనంతరం స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే, పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు, స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను పటిష్టంగా కొనసాగించాలని ఆదేశించారు.ప్రతి కేసులో చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పని చేయాలని సీఐ సిబ్బందికి సూచించారు. స్టేషన్ పనితీరును మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన మార్గనిర్దేశం చేశారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భద్రత, న్యాయం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.