తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, అనుమానాస్పద మరియు అక్రమ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా లాడ్జీలు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో లాడ్జీల్లో బస చేస్తున్న అతిథుల వివరాలు, ఐడీ ప్రూఫ్‌లు, రిజిస్టర్ల నిర్వహణ, సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లాడ్జీ యాజమాన్యాలకు సూచనలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన చోట్ల హెచ్చరికలు ఇచ్చి, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.