తొలి శుభోదయం టంగుటూరు:-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను స్వయం సమృద్ధిగా మార్చడానికి ‘ఈ-నారీ’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది, దీని కింద చురుకైన మహిళలకు సాంకేతికత, ఆర్థిక నిర్వహణపై శిక్షణ ఇచ్చి, వారికి డిజిటల్ పరిజ్ఞానం, రుణాల నిర్వహణలో బాధ్యతలు అప్పగిస్తుంది, తద్వారా వారికి అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ప్రతి 10 సంఘాలకు ఒక ‘ఈ-నారీ’ని ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇచ్చి, సంఘాల మధ్య సమన్వయం, డిజిటల్ సేవలు అందించేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ-నారీ కార్యక్రమం లక్ష్యాలు & ప్రయోజనాలు:ఆర్థిక స్వయం సమృద్ధి: డ్వాక్రా మహిళలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, డిజిటల్ సాధనాలను ఉపయోగించుకునేలా చేయడం.సాంకేతిక శిక్షణ: స్మార్ట్‌ఫోన్‌లు, యాప్‌ల వినియోగం, రుణాల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వడం.ఈ క్రమంలో టంగుటూరు మండలం లో 180 మంది ” e” నారీలు 86 మంది సి. ఆర్ పి లకు శిక్షణా కార్యక్రమంలో భాగంగా 3వ బ్యాచ్ తేది 24.01.2026 అలకూరపాడు మరియు మర్లపాడు CC క్లస్టర్స్ కు సంబంధించి “ఈ” నారి 68మంది & “CRP” లు 28 మంది కి శిక్షణ నిర్వహించుట జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు, గడ్డం కవిత మండల సమాఖ్య కార్యదర్శి శ్రీమతి తొట్టెం పూడి భవాని, గారు ఎ. పి.యం, శ్రీ బి. సుబ్బారావు సి సి లు కొండపి క్లస్టర్ ఎల్ సి శ్రీ యం . మాధవరావు మరియు వివో ఏ లు ” సి ఆర్ పి ” లు “ఈ”నారీలు పాల్గొనుట జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *