తొలి శుభోదయం టంగుటూరు:-
పొగాకు బోర్డు టంగుటూరు వారి అధ్వర్యం లో 2025-26 పంటకాలానికి పొగాకు సాగులో ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయుటకు ఎంపిక చేయబడిన జరుగుమల్లి గ్రామంలో పొగాకు సాగులో అవలంబించవలసిన ఉత్తమ యజమాన్య పద్దతులు పై అవగాహన సదస్సు నిర్వహించడమైనది . మరియు పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఒంగోలు మరియు టంగుటూరు పొగాకు బోర్డు వేలం కేంద్రం వారి ఆధ్వర్యంలో పొగాకు కంపెనీల ప్రతినిధులతో కలిసి క్షేత్ర మిత్ర బృందంగా ఏర్పడి టంగుటూరు పొగాకు బోర్డు వేలం కేంద్రం పరిధిలోని గ్రామాలలో పర్యటించి పొగాకు రైతులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను తెలుసుకొని తగు సలహాలు సూచనలు ఇవ్వటమైనది.

ఈ కార్యక్రమానికి ముందుగా బోర్డు అధికారులు మరియు కంపెనీ ప్రతినిధులు జరుగుమల్లి, చింతలపాలెం,దావగూడూరు రైతులతో కలిసి పొగాకు తోటలును, మరియు బ్యారెనులు, క్యూరింగులు గ్రేడింగులు, పరిశీలించడమైనది.ఈ కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి పొగాకు రైతులకు పొగాకు సాగులో తీసుకోవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులు వివరించారు నాణ్యమైన నారు ఎంపిక.
పచ్చి రొట్టె ఎరువులు, మరియు ఇతర సేంద్రియ ఎరువులు వాడకం గురించి.పక్వానికి వచ్చిన ఆకులు మాత్రమే రెలుపులు చేయుటం ద్వారా.రసాయనిక పురుగు మందులకు బదులు జీవసంబంధిత పురుగుమందులు వాడుట, లింగాకర్షణ బుట్టలు, జిగురు అట్టలు, మరియు పొలం చుట్టూ ఎర పంటలైన బంతి, ఆముదం పంటలు వేయుట ఇంకా క్యూరింగ్ చేయనప్పుడు తగిన సంఖ్యలో మాత్రమే పొగాకు కర్రలను బ్యారెన్ లో ఎక్కించవలెనని, బ్యారెన్ లు అగ్ని ప్రమాదాలు జరగకుండా గొట్టములపై ఇనుప జల్లడలను ఏర్పాటు చేసికొనవలెనని, క్యూరింగ్ వారిగా మండేలు వేసుకొన వలెనని, మండేలను నాణ్యత దెబ్బతిన్న కుండ తిరగ వేసుకొనవలెనని, క్యూరింగ్ చేయనప్పుడు బ్యారన్ లో క్యూరోమీటర్ అమర్చుట ద్వారా ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పొగాకు రంగు కాపాడుకోవచ్చునని తెలిపారు బ్యారన్ లో క్యూరింగ్ చేసేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే ఆలస్యం కాకుండా పొగాకు బోర్డుకు తెలియజేస్తే మేము ఇన్సూరెన్స్ వాళ్లకు తెలియపరుస్తాము టార్పాలిన్ పట్టలను వాడుట ద్వారా క్షేత్రస్థాయిలో పొగాకేతర అన్యపదార్థాలను కలవకుండా నివారించవచ్చునని తెలిపారు పొగాకు రైతులు అందరూ మంచిగా గ్రేడింగ్ చేసేటప్పుడు అన్య పదార్థాలు లేకుండా చూసుకోవాలని తెలిపినారు.ఈ సంవత్సరం పొగాకు తోటలలో పొగాకు మల్లె ఉందని దానిని పూత వచ్చి విత్తనం ఏర్పడక ముందునే పీకి కాల్చి వేయడం ద్వారా పొగాకుమల్లె ను నివారించవచ్చునని తెలిపారు. వరుసుగా జనుము, నువ్వులు మొదలైన పంటలు వేయటం ద్వారా పొగాకు మల్లెను నివారించవచ్చునని తెలిపారు. అలాగే ఈ సంవత్సరం వాతావరణం అనుకుకూలించడం వలన పొగాకు తోటల్లో పేను బంక వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.పేను బంక నివారణ కొరకు ఇమిడాక్లోప్రిడ్ @ 2.5 మీ.లీ లేక థయామిధోక్సామ్@ 25 డబ్ల్యు. జి @ 2 గ్రా. లేక ఫ్లోనికమిడ్ @ 4 గ్రా. 10 లీ. నీటిలో పిచికారి చేసుకోవాలన్నారు.కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేయించుకునే వాళ్ళు బోర్డు దగ్గరికి వచ్చి బోర్డు క్షేత్ర సహాయాధికారి లేదా బోర్డు క్షేత్రాధికారికి తెలియపరచి అనుమతి తీసుకోవలేను. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి, చింతలపాలెం, దావగూడూరు మరియు చిర్రికూరపాడు గ్రామాలలో పొగాకు పొలాలు మరియు క్యూరింగ్, గ్రేడింగ్ లు పరిశీలించి తగు సూచనలు మరియు జాగ్రత్త లు తీసుకోవాల్సిందిగా రైతులకు తెలిపినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. ఎస్. రామా రావు – ప్రాంతీయ అధికారి , (SBS) ఒంగోలు. అట్లూరి. శ్రీనివాసరావు – వేలం నిర్వహణ అధికార. ఎం. సత్య శ్రీనివాస్, వేలం నిర్వహనాధికారి. ఎం. వెంకట రావు- ఐటీసీ మేనేజర్. ఎ. రామాంజనేయులు, మేనేజర్, పోలిశెట్టి కార్తీక్, – మేనేజర్ జి.పి. ఐ, పొగాకు బోర్డు సిబ్బంది మరియు జరుగుమల్లి, చింతలపాలెం, దావగూడూరు మరియు పి వి పాలెం గ్రామాల రైతులు పాల్గొన్నారు.
