తొలి శుభోదయం కందుకూరు:-

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగరవేసిన కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు నరేంద్ర విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గణతంత్రం, సమానత్వం, స్వేచ్ఛ, సోదర భావంతో మెలుగుతూ, రాజ్యాంగ స్ఫూర్తిని మరియు మహనీయుల త్యాగాలని అందరూ స్మరించుకోవాలని కోరారు. వారు చూపిన బాటలో పయనిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు. నవ భారత్ ను నిర్మించడం కోసం, వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా మన అడుగులు ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు. తదుపరి మాట్లాడిన అధ్యాపకులు అందరూ విద్యార్థినీ విద్యార్థులు మంచిగా చదువుకొని దేశాభివృద్ధికి దోహదపడాలని కోరారు. తమ తల్లిదండ్రులకు, తమ గ్రామాలకు మంచి పేరు తెచ్చే విధంగా తయారు కావాలని సూచించారు. సభానంతరం కళాశాల నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ కె. సుజాత, శ్రీ కె .శ్రీనివాసులు, డాక్టర్ పి రాజగోపాల్, డాక్టర్ డి రామాంజనేయులు, కె నరేష్ రాజా , డాక్టర్ జె. హనుమంతరావు, డాక్టర్ ఐ. అనూష , ఫిజికల్ డైరెక్టర్ కె.కరుణ రత్నకుమార్ తోపాటు బోధననేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *