తొలి శుభోదయం కందుకూరు:-
2025 డిసెంబర్18, 19 తేదీలందు టీఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కందుకూరులో అంతర్జాతీయ అంతర్జాల సదస్సు భాష – సాహిత్యము – రాజకీయ రంగాలలో నూతన ధోరణులు – విశ్లేషణ (1947 నుండి 2025 వరకు) అనే అంశంపై తెలుగు, ఇంగ్లీషు మరియు పొలిటికల్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రవి కుమార్ తెలిపారు.రెండు రోజులపాటు నిర్వహించబడే ఈ సదస్సులో పై మూడు విభాగాలకు చెందినటువంటి అధ్యాపకులు మరియు పరిశోధకులు పత్ర సమర్పణ చేయవచ్చును. పత్ర సమర్పకులు సమర్పించిన పత్రాలు పీర్ రివ్యూడ్ జర్నల్ లో ప్రచురింపబడతాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రవికుమార్ తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్ ను శుక్రవారం రిలీజ్ చేయడం జరిగింది.