తొలి శుభోదయం కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) కందుకూరు కు ప్రతిష్టాత్మకమైన ‘ ఛాంపియన్ పెర్ఫార్మెన్స్ అవార్డ్-ఇన్స్టిట్యూషనల్ ఎకో ఇంపాక్ట్ అవార్డు 2025 లభించడం ఎంతో ఆనందదాయకమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్ తెలియజేశారు.ముంబై ఆధారంగా పనిచేస్తున్న గ్రీన్వయో సొల్యూషన్స్, మహారాష్ట్ర అను అంతర్జాతీయ పర్యావరణ సంస్థ 20 25 వ సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా అన్ని కళాశాలలో పర్యావరణానికి మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను, అన్ని కళాశాలలను పరిశీలించి టీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఈ అవార్డు అందజేయడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవికుమార్ కు, కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. తిరుపతి స్వామికి సర్టిఫికెట్లు, అవార్డులు అందజేయడంతో పాటు కళాశాలకు ఒక సర్టిఫికెట్ మరియు ట్రోఫీ కూడా అందజేయడం జరిగింది. కళాశాలలో గత నాలుగు- అయిదు సంవత్సరాలుగా చేపట్టిన పర్యావరణ కార్యక్రమాలతో పాటు, కొత్తగా చేపట్టబోతున్న మియావాకి విధానం ద్వారా వనాన్ని పెంచటం అను కార్యక్రమానికి ఈ అవార్డు అందజేయడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్రంలోనే ఏ కళాశాలలో కూడా లేనివిధంగా మొదటిసారి ఈ మియావాకి వనాన్ని, స్కంధ పురి సేవా సమితి సహకారంతో కళాశాలలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోష దాయకమని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ అవార్డు ఇచ్చిన స్ఫూర్తితో మరింత పర్యావరణహితమైన కార్యక్రమాలు కళాశాలలో చేపడతామని తెలియజేశారు.