తొలి శుభోదయం ప్రకాశం:-

“ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్” (TET) పరీక్షల నేపథ్యంలో, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.పరీక్షలు ప్రశాంతంగా, సురక్షితంగా, ఎటువంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను మోహరించి, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో నిరంతర నిఘా మరియు పర్యవేక్షణ కొనసాగించారు. అభ్యర్థులు నిస్సంకోచంగా పరీక్షలు రాయడానికి అవసరమైన భద్రతా చర్యలను పోలీసులు తీసుకున్నారు.
ప్రజల సహకారంతో పరీక్షల నిర్వహణ విజయవంతంగా పూర్తయ్యేలా ప్రకాశం జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *