తొలి శుభోదయం ప్రకాశం:-
జాతీయ రోడ్డు భద్రతా కార్యక్రమాన్ని పురస్కరించుకొని రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల్లో భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతోప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో కాలేజ్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అతివేగం నివారణ, మద్యం సేవించి వాహనం నడపరాదనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. పట్టణంలోని ముఖ్య రహదారుల గుండా ర్యాలీ కొనసాగుతూ రోడ్డు భద్రతపై నినాదాలు, సందేశాల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు.ఈ కార్యక్రమాన్ని తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించగా, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) మరియు రవాణా శాఖ (RTO) సిబ్బంది సహకారంతో ర్యాలీ విజయవంతంగా కొనసాగింది. రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణలో యువత పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా పోలీసులు వివరించారు.ర్యాలీ అనంతరం విద్యార్థులు, అధికారులు కలిసి హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించడం, రోడ్డు భద్రతను గౌరవించడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ (ఓత్) చేశారు. యువతే రోడ్డు భద్రతకు మార్గదర్శకులని, వారి భాగస్వామ్యంతోనే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఇలాంటి అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిరంతరం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.