తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

సువిశాలమైన తీర ప్రాంతం ఉన్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్ అభివృద్ధి కి సంక్షేమం అభివృద్ధి తో పాటు పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న డబుల్ ఇంజన్ ఎన్ డి ఎ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. శనివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల లో బీచ్ ఏర్పాటు చేసిన బీచ్ ఫెస్టివల్ 2026 ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ, పర్యాటక కార్పొరేషన్, రాష్ట్ర మారిటైమ్.బోర్డ్ జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాటు చేయడం తో ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలిసిందన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణ తో రాష్ట్ర అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, ఉక్కుమనిషి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ల సమిష్టి నాయకత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కి కృషి చేస్తుందన్నారు. రాష్ట్రం లో సంస్కృతి సంప్రదాయాలు కళలు,కళాకారుల సంక్షేమం అభివృద్ధి కి పెద్ద పీట వేసి కృషి చేస్తుందన్నారు. గ్రామీణ తీర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా పాకల బీచ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుని అభివృద్ధి చెయ్యడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బీచ్ ఫెస్టివల్ ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ డా నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ రాజ బాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ టి డి పి అధ్యక్షుడు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, జన సేన జిల్లా అధ్యక్షుడు రియాజ్, జిల్లా తెలుగు దేశం పార్టీ శాసన సభ్యులు, నియోజక వర్గాల ఇంచార్జి లు, శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ విప్ కంచర్ల శ్రీకాంత్, పాకల సర్పంచ్ సైకం చంద్రశేఖర్, ఎన్ డి ఎ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ముందుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమీషనర్ పానకాల రావు ఆధ్వర్యంలో సింగరాయకొండ గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణ వేణి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గుప్తా, ల పర్యవేక్షణ లో పాత సింగరాయకొండ, వల్లూరు, మాలకొండ, ప్రాంతాలకు చెందిన అర్చక స్వాములు యా గ్ని కుల సహకారంతో ప్రత్యేకంగా సాగర హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం వివిధ శాఖల అధికారులు సిబ్బంది సహకారంతో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ చేపట్టారు. ప్రత్యేకంగా సుందర పరిశుభ్ర బీచ్ గా తీర్చిదిద్దడమే ధ్యేయం గా ఒంగోలు, కందుకూరు డివిజన్ ల పంచాయతీ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది పారిశుధ్య చర్యలు చేపట్టి క్లీన్ బీచ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సేవలు అందించారు. పర్యాటకులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లో పాకల, సింగరాయకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బంది సేవలు అందించారు. ప్రత్యేకించి జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఆధ్వర్యంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణ లో పోలీస్ సిబ్బంది రక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నియంత్రణ నిరంతర నిఘా ఏర్పాట్లు చేపట్టారు. బీచ్ ఫెస్టివల్ విజయవంతం కావడం ఎంత ముఖ్యమో వచ్చిన ప్రజలు సురక్షితంగా తిరిగి ఇంటికి చేరడం కూడా అంతే ముఖ్యమని పోలీస్ సిబ్బంది సేవలు అందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *