తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు ప్రజల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాహనదారులపై ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ, జరిమానాలు విధించారు.మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు ప్రాణ నష్టం, కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అలాగే, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండి బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల ప్రాణ రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.