తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గ :-
“సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే మహోన్నత నినాదంతో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ మహత్తర పార్టీ ప్రజాసేవలో అగ్రగామిగా నిలుస్తోంది. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలం, వేగూరు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది.అనంతరం పంచాయతీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది.