తొలి శుభోదయం సింగరాయకొండ:-

శానంపూడి గ్రామానికి చెందిన తొట్టెంపూడి అంకయ్య వర్ధంతి సందర్భంగా తన మనవడు తొట్టింపూడి సుబ్బరాయుడు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో శుక్రవారం కూడా తాతయ్య గిరిజన కాలనీ చిన్నారులకు స్నేహపూర్వక వాతావరణంలో భోజనము పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు శుభ్రంగా తయారుచేసిన పోషకాహార భోజనం వడ్డించారు.తొట్టెంపూడి అంకయ్య స్మృతిని సేవా కార్యక్రమాలతో నిలుపుకోవాలనే సంకల్పంతో కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి,కొన్ని సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శానంపూడి గ్రామానికి చెందిన యువత గత 15 సంవత్సరాల నుండి తమ సేవా కార్యక్రమాలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని, వివిధ దేశాల్లో, రాష్ట్రాలలో ఉద్యోగరీత్యా ఉంటున్న యువత తమ ద్వారా ఈ సేవా కార్యక్రమాలలో చేయించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.అదేవిధంగా చిన్నారులకు విద్యతో పాటు పోషకాహారం అవసరమని, మొక్కకు నీరు ఎంత ముఖ్యమో, ఎదిగేటప్పుడు పిల్లలకు పోషకాహారం అంతే అవసరం అన్నారు.మన పరిసర ప్రాంతాల్లో పోషకాహార లోపం ఉన్న పిల్లలను ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయిని కత్తి మాధురి మరియు అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *