తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు దర్శి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని దర్శి సీఐ , దర్శి ట్రాఫిక్ ఎస్‌ఐ కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు, అతి వేగం వల్ల కలిగే ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో ఉన్న ప్రాధాన్యత గురించి వివరించారు.ప్రజలు తమ ప్రాణ భద్రత కోసం తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్ వినియోగాన్ని అలవాటుగా మార్చుకోవాలని పోలీసులు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *