తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ వినియోగం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వాడకూడదని, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.దర్సి సిఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలు కచ్చితంగా పాటించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజల భద్రత కోసం ఇటువంటి తనిఖీలు మరింత బలోపేతం చేస్తామని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *