తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా దర్శి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు.ప్రయాణికులు, ప్రజలు దాహం తీర్చుకునేలా దర్శి మున్సిపాలిటీ మరియు వాసు-1 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.అలాగే దర్శి మండల టిడిపి అధ్యక్షులు మరెళ్ల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు పుల్లచెరువు సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గర్నిపూడి స్టీవెన్ , నీటి సంగం DC ఎలుగొండరెడ్డి , బీజేపీ నాయకులు తిండి నారాయణ రెడ్డి , వార్డ్ కౌన్సిలర్లు మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *