దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ లలో సాధికారత, నైపుణ్యం పెంపునకు ఉచిత ఆన్ లైన్ శిక్షణ
శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం అమరావతి:-
రాష్ట్రంలోని దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ కి సాధికారత, నైపుణ్యం పెంపునకు, ఉఫాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని దివ్యాంగులు, మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. 21 సెంచరీ సాప్ట్ వేర్ సొల్యూషన్స్ సహకారంతో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ కి ఆన్లైన్ ఎంవర్మమెంట్ స్కిల్ డెవలప్ మెంట్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి డా.స్వామి వెలగపూడి సచివాలయంలో గురువారం నాడు జూమ్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ కి నైపుణ్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోటీ పరీక్షలకు అవసరమైన సబ్జెక్టు బోధనతో పాటు డిజిటల్ స్కిల్స్ , కమ్యూనికేషన్ స్కిల్స్ , కెరీర్ గైడైన్స్, మెంటార్ షిప్ పై శిక్షణ అందిస్తారని తెలిపారు. ఈ శిక్షణ వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి, ఉద్యోగకాశాలకు బాటలు వేసేందుకు దోహదపడుతుందన్నారు.దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటుపడుతున్నారన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించారన్నారు. దివ్యాంగుల కోసం కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో లిప్టులు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. దివ్యాంగులకు త్వరలో ఉచితంగా త్రీవీలర్స్ పంపణీ చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు రూ. 6 వేలు పించన్ ఇస్తున్నామన్నారు. ట్రాన్స్ జెండర్స్ కి ఫించన్లతో పాటు గుర్తింపు కార్డులు ,రేషన్ కార్డుల పంఫిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ సమాజంలో ఎవరికీ తక్కువ కాదని ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు అందిపుచ్చుకుని ఆత్మస్ధైర్ద్యంతో ముందుకు సాగాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. ఈ శిక్షణను ఉచితంగా అందిస్తున్న 21 సెంచరీ సాప్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్ధ ప్రతినిధులను మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఈ సందర్భంగా అభినంధనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు వయవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రెటరీ ఐఏఎస్ సూర్య కుమారి, డైరక్టర్ రవి ప్రకాశ్ రెడ్డి, 21 సెంచరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ డైరెక్టర్ కె. ధరణి, సత్య కుమార్, శివాజీ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
