తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-

నేడు ప్రధాని నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ప్రవేశపెట్టడం నిజంగా చారిత్రక ఘట్టం.ఈ నిర్ణయం ద్వారా మహిళలకు కేవలం ప్రాతినిధ్యం మాత్రమే కాదు… నిర్ణయాధికారం కూడా లభిస్తుంది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే మహిళలు సర్పంచులు, కౌన్సిలర్లు, ఛైర్మన్లుగా తమ ప్రతిభను చాటుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండటం మనందరికీ గర్వకారణం.ఈ చారిత్రక నిర్ణయానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తెలుగుదేశం, బిజెపి మరియు జనసేన మహిళా నాయకులతో కలిసి నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *