తొలి శుభోదయం సింగరాయకొండ:-

సంక్రాంతి పండుగ సందర్భంగా పాత సింగరాయకొండ శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ క్షేత్రం శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ స్వామి వారి దేవాలయం పర్యవేక్షణ లో ఈ నెల 14 తేదీ నుండి 16 వరకు ప్రత్యేక ఉత్సవాలు, విశేష పూజలు సాంప్రదాయ పోటీలు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణ వేణి మంగళ వారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆ మేరకు కరపత్రం ద్వారా ఆమె మూడు రోజుల సంక్రాంతి వేడుకలను వివరించారు.సంక్రాంతి ఉత్సవములలో భాగంగా దేవాలయం ప్రాంగణం లో భోగి పండుగ నిర్వహించడం జరుగుతుందన్నారు.సాయింత్రం 5 గంటలకు దేవాలయం ప్రాంగణం లో గోదాదేవి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఆమె వివరించారు.సంక్రాంతి ఉత్సవాలలో ప్రధానమైన స్వామి వారి పుష్కరిణీ తెప్పోత్సవం 16 వ తేదీ సాయింత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుందని తెప్పోత్సవం అనంతరం రాత్రి 8 గంటలకు స్వామి వారి పార్వేట ఉత్సవం జరుగుతుందని ఆమె వివరించారు. నారసింహ స్వామి భక్తులు సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కార్యనిర్వహణ అధికారి కృష్ణ వేణి పిలుపు ఇచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *