తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణము లో చీమలదిన్నె లక్ష్మణ్ బాబు (ex miltary )
ఆధ్వర్యములో నల్లబండ బజార్ లో దుర్గమ్మ గుడి దగ్గర శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాషి వెంకట రామాంజనేయులు, దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి బిజెపి నాయకులు ఎస్ సి మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి మట్టే మల్ల పుల్లయ్య , వేమూరి శ్రీనివాస రావు, అంకన్నా రామక్రిష్ణ , యోగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, గురుప్రసాద్, తిరుపతయ్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఈ ప్రాంతము లో నిరుద్యోగులకు శిక్షణా సంస్థ ను ఏర్పాటు చేయడం సంతోషం వ్యక్తం చేశారు, అంతే కాకుండా ఈ శిక్షణలో నేవీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్,,ఎన్ డి ఏ ఉద్యోగాలకు సంబంధించిన నిరుద్యోగులకు ఎంతో మేలు ఇటువంటి సంస్ట గురించి ప్రజలు కు తెలియజేయడం చాలా ముఖ్యం అని తెలియ చేశారు.