తొలి శుభోదయం ప్రకాశం :-

నూతన సంవత్సర సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి పోలీస్ అధికారులు,సిబ్బంది మరియు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ తెలియజేశారు. కొత్త ఏడాదిలో రెట్టించిన ఉత్సాహంతో పని చేసేలా సిబ్బందికి స్ఫూర్తి నింపారు. కొత్త సంవత్సరంలో అందరికీ శుభములే కలగాలని ఆకాంక్షించారు. అనంతరం ఉత్తమ పోలీసింగ్ విధానాలు గురించి ఎస్పీ అధికారులకు పలు సూచనలు తెలియచేసారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, గత సంవత్సరం సాధించిన ప్రగతికంటే ఈ నూతన సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. అందరూ సమిష్టి కృషితో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని, సమస్యలతో వచ్చిన బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ వారి పక్షాన నిలవాలని తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామన్న నమ్మకాన్ని కలిగించే విధంగా పోలీసులు పనిచేయాలన్నారు. ఒక పోలీస్ అధికారిగా సమాజంలో మంచి పనులు చేసే గొప్ప అవకాశం ఉందని, మనం చేసే ప్రతి మంచి పని సమాజంపై విశేష ప్రభావం చూపుతుందన్నారు. కావున పోలీసులు నిత్యం ప్రజలతో మమేకమై, వారికి మరింత చేరువయ్యేలా సేవలను అందిస్తూ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఏవైనా సమస్యలు లేదా సూచనలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.డీటీసీ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ అనంతరం నూతన సంవత్సర సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ డీటీసీ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రంలో కేక్ కట్ చేసి, శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.2026 సంవత్సరం మీ అందరికీ ప్రత్యేకమైన సంవత్సరంగా నిలవాలని, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆరోగ్యం, మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ట్రైనింగ్ అత్యంత ముఖ్యమైందని, దీన్ని సీరియస్‌గా తీసుకొని శ్రద్ధతో చేస్తురని ప్రశంసించారు. శిక్షణ సమయంలో గాయాలు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. అలాగే, ఈ బేసిక్ ట్రైనింగ్ ఏ విధంగా కొనసాగుతుందో భవిష్యత్తులో కూడా అదే విధంగా విధి నిర్వహణలో ప్రతిబింబించాలన్నారు. శిక్షణలో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ నాణ్యతతో సాగాలని, స్పష్టమైన మరియు సరైన భాషలో బోధన ఉండాలని సూచించారు. శిక్షణార్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే స్వయంగా తెలియజేసుకునే విధంగా స్వేచ్ఛ కల్పించాలని అధికారులకు పలు సూచనలు తెలియచేసారు. ట్రైనింగ్ సెంటర్ ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని అందరూ డిఎస్పీలు, సిఐలు, RIలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *