తొలి శుభోదయం సింగరాయకొండ:-
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు సభ్యులు గౌరవ న్యాయమూర్తి డాక్టర్ వి లీలా శ్యాంసుందరి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, న్యాయవ్యవస్థలో న్యాయం, నైతిక విలువలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.బార్–బెంచ్ మధ్య సత్సంబంధాలు కొనసాగడం వల్ల న్యాయసేవలు ప్రజలకు మరింత సమర్థవంతంగా అందుతాయని ఈ సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తి కూడా బార్ అసోసియేషన్ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, న్యాయవాదులు వృత్తి నైతికతను పాటిస్తూ ప్రజలకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు కొల్లూరు వెంకట నరసింహారావు,బక్కమంతుల వెంకటేశ్వర్లు,సంజీవరెడ్డి,
న్యాయవాదులు రాఘవేంద్ర శ్రీనివాసులు, వంశీ,రియాజ్, కోదండపాణి, పంతగాని వెంకటేశ్వర్లు, శ్రీలక్ష్మి, వాసంతి,సుభాషిని తదితరులు పాల్గొన్నారు.