తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

ఆదివారం గిద్దలూరు కోర్టు భవనముల సముదాయంలో నూతనంగా మంజూరు అయిన రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు జడ్జిలు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వై.లక్ష్మణ రావు ప్రారంభించనున్నారని బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు పియన్ శేష శయనా రెడ్డి, ఏ. తిరుమల ప్రసాద్ లు మరియు ప్రధాన కార్యదర్శి బి. ఐజక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి లతోపాటు జిల్లా ఇంచార్జి జడ్జి టి. రాజ్యలక్ష్మి, గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. ఓంకార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె. భరత్ చంద్ర మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జడ్జి లు పాల్గొంటారని వారు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *