తొలి శుభోదయం ప్రకాశం:-

నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణలో Visible Policing ఒక ప్రభావవంతమైన పద్ధతిగా ప్రకాశం జిల్లా పోలీస్ విభాగం విజయవంతంగా అమలు చేస్తోంది.ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ రోడ్లపై స్పష్టంగా కనిపించే విధంగా విధులు నిర్వహిస్తూ, నేర నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు ప్రజల్లో భద్రతపై నమ్మకం పెంచేలా సేవలందిస్తున్నారు.
Visible Policing ద్వారా చైన్ స్నాచింగ్స్, గలాటాలు, అనుమానాస్పద చలనం వంటి నేరాలకు ముందుగానే అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతోంది. పోలీస్ సిబ్బంది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా మైదానంలో కనిపిస్తూ, నేరాలను ఆరంభ దశలోనే గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.ఈ విధానం ద్వారా ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత బలపడుతూ, జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *