తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం సీఐ సుబ్బారావు పర్యవేక్షణలో NH-544D కోమటి కుంట జంక్షన్ వద్ద విజిబుల్ పోలీసింగ్ మరియు వాహనాల ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వాహనాలను ఆపి డ్రైవర్ల వాహన భద్రతా చర్యలను పరిశీలించారు. హెల్మెట్లు, సీటుబెల్ట్లు, ఇన్సూరెన్స్, వాహన పత్రాలు తదితర అంశాలను తనిఖీ చేసి, లోపాలు ఉన్నవారికి తగిన సూచనలు అందించారు. అలాగే డ్రైవర్లకు రోడ్డు భద్రత, రూల్స్ పాటించడం, వేగంగా డ్రైవింగ్ చేయకూడదని అవగాహన కల్పించారు.సురక్షిత ప్రయాణం కోసం నియమాలను తప్పనిసరిగా పాటించాలని, పోలీసులు నిరంతరం హైవేల్లో తనిఖీలు కొనసాగిస్తారని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం రూరల్ ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు.