తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:-

జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీమంత్రి, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు, మాజీ సర్పంచ్, స్వర్గీయ తాటికొండ రాంబొట్లునాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖమంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయస్వామి కలిసి విగ్రహాలను ఆవిష్కరించారు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, రాష్ట్ర మారిటైంబోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు బంధువైన రాంబొట్లునాయుడు, చిన్నవయసులోనే చనిపోవడం బాధాకరమని, సర్పంచిగా, మండల పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా, పార్టీ కోసం విధేయుడిగా పనిచేసి, ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. రాంబొట్లునాయుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ… తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేతలందరూ భారీ కేక్ కట్ చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *