తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో అక్రమంగా మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు.అదేవిధంగా మద్యం సేవనంతో అపరిశుభ్రంగా మారిన ప్రాంతాలను గుర్తించి, శుభ్రపరిచే పరిశుభ్రత కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రజలు వినియోగించే ప్రదేశాలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు పోలీసులు స్వయంగా ముందుకు రావడం ప్రజల నుంచి ప్రశంసలు పొందింది.ప్రజల భద్రత, సమాజ ప్రశాంతతే ప్రధాన లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్లు, పహారాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఎవరైనా బహిరంగ మద్యం సేవనం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112కు తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే శుభ్రమైన, సురక్షితమైన ప్రకాశం జిల్లా సాధ్యమని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.
