తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

దక్షిణ సింహాచల గా ప్రాచుర్యం పొందిన యోగానంద లక్ష్మి నారసింహ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రాన్ని పర్యాటక అభివృద్ధి కేంద్రంగా తీర్చి దిద్దేందుకు క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తగిన ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన భారత పర్యాటక శాఖ విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సి గంగాధర్ , గోవా మహారాష్ట్ర ఆర్టిటెక్ రవిశంకర్, పర్యాటక శాఖ సీనియర్ ఇంజనీర్ సిబ్బంది తో ఆయన యోగానంద లక్ష్మి నారసింహ క్షేత్రాన్ని సందర్శించారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పర్యాటక అభివృద్ధి కి చర్యలు చేపట్టిందని దానిలో భాగంగా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ లో ప్రసిద్ధి చెందిన యోగానంద లక్ష్మి నారసింహ స్వామి ఆలయం అభివృద్ధి కి అవసరమైన ప్రతిపాదనలు, చేపట్టాల్సిన పనులు స్థల పురాణం భూమి హక్కులు గురించి అధికారులతో చర్చించారు. యోగానంద లక్ష్మి నారసింహ స్వామి ఆలయం ఎదుట ప్రకారం పెంపు, మెట్లు, ఆర్చ్, గాలి గోపురం, కొండమీదికి పోవు మార్గం పెంపు, స్వామివారి పుష్కరిణీ భవనాశి అభివృద్ధి, గిరి ప్రదక్షిణ మార్గం, దేవుడి బాట అభివృద్ధి, కొండ పై ప్రత్యేక భోజన శాల, యాగ శాల, ఇతర అవసరాల గురించి అధికారులతో చర్చించారు. భూమి యాజమాన్య హక్కులు, నిర్మాణాలు, వసతులకు సంబంధించిన ప్రతి పాదన లు, పర్యాటక అభివృద్ధి శాఖ కి దేవస్థానం వైపు నుండి ప్రతిపాదనలు పంపాలని డా నూకసాని బాలాజీ ధార్మిక మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు,దేవాదాయ శాఖ అధికారి కృష్ణవేణి సూచించారు. దేవస్థానం వైపు నుండి ప్రతిపాదనలు విన్నపం అందిన వెంటనే కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందుతామని బాలాజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట తిరుపతి ప్రాంతీయ పర్యాటక ఇంజనీర్, సిబ్బంది, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు కార్యనిర్వహణ అధికారి కృష్ణ వేణి ,దేవాదాయ శాఖ సిబ్బంది, అర్చకులు, స్వామివారి భక్తులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *