తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్న ప్రకాశం జిల్లా పోలీసులు, “పల్లెనిద్ర” కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు.గ్రామాల్లో ప్రజల భద్రత, చట్టసంవ్యవస్థ, మద్యం/గంజాయి రవాణా, గృహ హింస, సైబర్ నేరాలు, యువతలో పెరుగుతున్న పేకాట వ్యసనాలు వంటి అంశాలపై ప్రజలతో చర్చించి, తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
పల్లెనిద్రల సమయంలో పోలీసులు గ్రామ పెద్దలు, యువత, మహిళలతో ముఖాముఖీగా మాట్లాడి, సమస్యలను రికార్డ్ చేసి వాటిని పరిష్కరించేందుకు సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తున్నారు.ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించబడుతున్నాయి.“ప్రజల సమస్యల పరిష్కారమే పోలీసుల ప్రాధాన్యత” అనే నినాదంతో ప్రకాశం పోలీసులు ప్రజల అండగా నిలుస్తున్నారు.