తొలి శుభోదయం న్యూస్ దర్శి :-

కూటమి ప్రభుత్వం గ్రామాభివృద్ధి దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె నిద్ర” కార్యక్రమం భాగంగా పోతవరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారితో కలిసి దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.

ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.నీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై ఫిర్యాదులు స్వీకరించారు.గ్రామంలో రాత్రి బస చేసి ప్రజలతో మాట్లాడి సమస్యలకు తక్షణ పరిష్కార మార్గాలు సూచించారు.ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూ:
“ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ , మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే దిశగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల స్పూర్తితో దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాను” అని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే చర్యలు చేపట్టేలా చేశారు.గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ చైర్మన్, టిడిపి నాయకులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *