తొలి శుభోదయం సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని రైతన్న మీకోసం అనే కార్యక్రమం అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరిగినది ముఖ్యంగా మన జిల్లా అధికారి అయిన ఎస్ శ్రీనివాస్ రావు పాకాల గ్రామంలో జరిగే రైతన్న మీకోసం కార్యక్రమానికి హాజరై అక్కడ రైతులకు ఐదు విధానాలతో కూడిన కార్యాచరణ గురించి రైతులకు వివరించడం జరిగింది నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్ ద్వారా 100% రాయితీపై ఎస్సీ ఎస్టీలకు 80 శాతం రాయితీపై ఓసి బీసీలకు డ్రిప్ పరికరాలు ఇవ్వడం జరుగుతుందని మరియు డ్రోన్ పరికరం ద్వారా పురుగుమందులను పిచికారి చేయడం వలన పెట్టుబడికి అయ్యే ఖర్చు తగ్గుతుందని రైతులకు వివరించడం జరిగింది ప్రకృతి వ్యవసాయం చేయడం వలన కలిగే ఉపయోగాలు మరియు ద్రవజీవామృతం ఘనజీవామృతం ఎలా పిచికారి చేయాలో రైతులకు వివరించడం జరిగింది మన మండల వ్యవసాయ అధికారి అయిన టీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ వరిపైరుపైఆకుముడుత పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ కింద ద తాడుతో లాగడం వల్ల పురుగులను కొంతవరకు అధిగమించవచ్చని రైతులకు వివరించడం జరిగింది. తరువాత ఫిషరీ అసిస్టెంట్ మత్స్య శాఖలో ఉండే పథకాల గురించి రైతులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ నజ్మా షమిలా బేగం గ్రామ వ్యవసాయ సహాయకులు అరుణ్ మరియు భవాని , ఫిషరీ అసిస్టెంట్ , జె డ్బి ఎన్ఎఫ్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *