తొలి శుభోదయం సింగరాయకొండ:-

ఒంగోలు డివిజనల్ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పాకల బీచ్ నందు విస్తృత స్థాయిలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించబడింది. బీచ్ పరిసరాలను శుభ్రంగా ఉంచడం, చెత్త రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులు ఉత్సాహంగా పాల్గొని బీచ్ అంతటా చెత్తను ఏరుకొని శుభ్రపరిచారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రజలు సహకరిస్తేనే శాశ్వత పరిశుభ్రత సాధ్యమవుతుందని తెలిపారు. ఇలాంటి పారిశుధ్య కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని వెల్లడించారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *