తొలి శుభోదయం సింగరాయకొండ:-

​పాత శింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థాన చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు ని MRPS ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ తమ బృందంతో కలిసి ఘనంగా సన్మానించారు.​నాయుడు పదవీ స్వీకారంపై కోటి మాదిగ మాట్లాడుతూ..
​శ్రీనివాసులు నాయుడు పదవికి వన్నె తెచ్చే వ్యక్తిత్వం కలిగిన ప్రజా నాయకుడు. సామాన్యుల పట్ల మమకారం, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న ఆయన చైర్మన్ పదవి చేపట్టడం ఈ క్షేత్రానికి శుభసూచకం. నాయుడు హయాంలో మరియు పాలకమండలి సభ్యుల సమన్వయంతో శింగరాయకొండ క్షేత్రం ఆధ్యాత్మికంగా మరియు అభివృద్ధి పరంగా అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని ఆశిస్తున్నాము.ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ రేణమాల మాధవ మాదిగ,శింగరాయకొండ మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ,కందుకూరు మండల అధ్యక్షులు గౌడుపేరు మహేష్ మాదిగ, మండల కో-కన్వీనర్ పోనుగోటి ఉదయ కుమార్ మాదిగ, సూరపోగు మోజెస్ మాదిగ, అభిషేక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *