తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

తర్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతేపురం గ్రామ వ్యవసాయ పొలాల్లో గోప్యంగా జరుగుతున్న అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు ముందస్తు ప్రణాళికతో ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదంలో నిమగ్నమై ఉన్న 7 మందిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి మొత్తం రూ.1,24,700 నగదు, 3 మోటార్ సైకిళ్లు మరియు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జూదానికి ఉపయోగించిన సామగ్రిని కూడా పోలీసులు సీజ్ చేశారు.అరెస్టు చేసిన వ్యక్తులపై చట్టపరమైన కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన నిఘా పెట్టి, ఇటువంటి చర్యలను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలు కూడా చట్ట విరుద్ధ కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *