తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పీజీఆర్‌ఎస్ (మీ కోసం) ద్వారా అందిన ప్రజా ఫిర్యాదులపై విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ పిటిషన్లను సవివరంగా పరిశీలించి, సంబంధిత ఫిర్యాదులపై వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేకూర్చేలా, సమస్యలను చట్టపరంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు.ప్రజల సమస్యలకు వేగంగా స్పందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, పీజీఆర్‌ఎస్ పిటిషన్లను ప్రాధాన్యతతో తీసుకుని పరిష్కరించాలని సీఐ ఆదేశించారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పారదర్శకంగా విచారణలు చేపట్టాలని తెలిపారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల సమస్యల పరిష్కారానికి, న్యాయం మరియు భద్రత కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.