తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చాట్లమడ గ్రామంలో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నారనే నమ్మకమైన సమాచారంతో ఎస్‌ఐ పెద్దారవీడు గారు తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.ఈ దాడిలో అక్రమంగా కార్డుల ఆట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.5,290/- నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితులపై చట్టప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.సమాజంలో అక్రమ కార్యకలాపాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, పేకాట వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని ప్రకాశం జిల్లా పోలీసులు హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *