తొలి శుభోదయం కందుకూరు:-

మన యువనేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు రూ. 2.25 లక్షల విలువైన వైద్య పరికరాలను (ECG మిషన్, నెబ్యులైజర్లు, బెడ్లు తదితర వస్తువులు) దాతల సహకారంతో అందజేయడం జరిగింది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కందుకూరు నియోజకవర్గానికి ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా సుమారు 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించగలిగాము. ఆసుపత్రి అభివృద్ధికి రూ. 50 వేల విరాళం అందించిన పిడికిటి వెంకటేశ్వర్లు కి, అలాగే ఇతర సామగ్రిని సమకూర్చిన ఉప్పుటూరి శ్రీనివాసరావు, వెంకట నరసింహం గార్లకు, ఇతర దాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక చిన్న విన్నపం నన్ను కలవడానికి వచ్చే వారు దయచేసి శాలువాలు, పూలదండలు తీసుకురావద్దు. అవి ఎవరికీ ఉపయోగపడవు. వాటికి బదులుగా ఆసుపత్రి అభివృద్ధికి విరాళాలు లేదా వస్తువులు అందిస్తే పేద రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఆసుపత్రిని మనమే అభివృద్ధి చేసుకుందాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *