తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు అధ్యక్షతన పోతురాజు మిట్ట ఆనందపురం రోడ్డు కృప ఆత్మ సన్నిధి మినిస్ట్రీస్ లో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక బ్రదర్ వి. ఆంద్రేయ్య మాట్లాడుతూ ఏసుక్రీస్తును సిలువ వేసిన మూడవ రోజున ఆయన సమాధి నుండి తిరిగి లేచారని స్మరించుకుంటూ ఈస్టర్ పండుగను జరుపుకుంటారని సందేశం ఇచ్చారు. అనంతరం దాతలు అందజేసిన చీరలు దుప్పట్లు సిస్టర్ వి. ఎలిసమ్మ ఆంద్రేయ్య చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ బాబు, వేణుబాబు శివ విశ్వ నితీష్ తిరుపతిరావు, కొండయ్య, రవణమ్మ, అపర్ణ,ఈశ్వరమ్మ మరియు సంఘస్తులు పాల్గొన్నారు.