తొలి శుభోదయం కందుకూరు:-

కుల,మతాలకతీతంగా గత ఐదు సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తున్న ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో చలి తీవ్రత ఎక్కువ ఉన్న పట్టణ శివారు ప్రాంతాల్లో కొంత మంది వృద్ధులు, పిల్లలు కప్పుకోవడానికి దుప్పటి లేక ఇబ్బంది పడుతున్న వారి పరిస్థితి చూసి చలించి పేదవారికోసం ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చేసి తద్వారా బ్లాంకెట్లు దాతల సహకారంతో పంపిణీ చేయడం జరిగింది అని సెక్రటరీ షంషేర్ అన్నారు.అలాగే ప్రతి ఇంటి నుండి సేకరించిన పాత బట్టలు కూడా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ సాజిద్, ట్రజరర్ హఫీజ్, అయూబ్ ఖాన్, షంషుద్దీన్ పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *