తొలి శుభోదయం ప్రకాశం:-
మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ , రైల్వే స్టేషన్, కంభం బస్టాండ్ సెంటర్, దోర్నాల బస్టాండ్ సెంటర్ తో పాటు చెన్నకేశవ స్వామి టెంపుల్ , P.S.Colony, పరిసర ప్రాంతాలలో నార్కోటిక్ మరియు నేరస్తులను, మందు గుండు సమగ్రని గుర్తించుటకు రాక్సీ, చీత డాగ్ లతో ప్రత్యేకంగా విస్తృతంగా పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించడం జరిగినది.బస్టాండ్ లోపల ప్రదేశం లో ప్రయాణీకుల బ్యాగులను తనిఖీ చేయడం తోపాటు అనుమానం వచ్చిన ప్రయాణికుల బ్యాగ్ లను ఒపెన్ చేయించి తనిఖీలు చేశారు.
ప్రయాణికుల అధార్ కార్డు పైన అడ్రస్ ను పరిశీలించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇదిలా ఉంటే బస్టాండ్ లో ఉన్న పార్సిలు సర్వీసు సెంటర్ ను తనిఖీ చేసి,పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వచ్చే… పార్సిలను తీసుకొవద్దని.. అలాంటివి మీ దృష్టికి వస్తే.. వేంటనే స్ధానిక పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని అక్కడ ఉన్న సిబ్బందికి సూచించడం జరిగినది.మరోవైపు సమీపంలో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద పరిసర ప్రాంతాలను రాక్సీ మరియు చీత డాగ్ లతో జల్లడ పట్టారు.దేవాలయాల పరిసరాలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవంటూ.. హెచ్చరించారు. మార్కెట్ సెంటర్ లోని ప్రాంతంలోని పరిసరాలను పూర్తిగా పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలతో వారు ఇంట్రాక్ట్ అయ్యారు.ఇతర ప్రాంతాల నుండి అనేక మంది మార్కెట్ సెంటర్ కు వివిధ పనులపై వస్తుంటారని ప్రతి ఒక్కరూ… మర్యాదగా వ్యవహరించాలన్నారు.రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో డాగ్ లతో తనిఖీలు చేసి ప్రయాణికుల బ్యాగ్ లను తనిఖీలు చేశారు.మార్కాపురం ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఎర్పట్లు చేస్తున్నామని పోలీసు సిబ్బంది అన్నారు.ఈ తనిఖీలు లో మార్కాపురం ఇన్స్పెక్టర్ సుబ్బారావు, మార్కాపురం రూరల్ ఎస్సై అంకమ్మరావు, డాగ్ హ్యాండ్లర్ లు వెంకటేశ్వర్లు, విద్య సాగర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.