జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ అధికారులు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం ప్రకాశం:-
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఎందరో మేధావులు, త్యాగధనులు అనేక సంవత్సరాల పాటు అహర్నిశలు కృషి చేసి మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుండి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిందని, ఆ చారిత్రక రోజు నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు, హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది రాజ్యాంగ స్ఫూర్తితో నిబద్ధత, నిష్పక్షపాతతతో ప్రజల హక్కులను కాపాడుతూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు ఇంకా మెరుగైన సేవాలందించాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు, సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, DPO AO రామ్ మోహన్ రావు,సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు, డిపిఓ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు.
