తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రాజ్యాంగ దినోత్సవంను గౌరవప్రదంగా నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది సమగ్రంగా హాజరై రాజ్యాంగ ప్రతిజ్ఞ చేసి, భారత రాజ్యాంగంలో ఉన్న విలువలను కాపాడాలని సంకల్పం వ్యక్తం చేశారు.తరువాత రాజ్యాంగం ప్రాముఖ్యత, పౌరుల హక్కులు, విధులు మరియు ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజా భద్రత, న్యాయం మరియు ప్రజలకు సేవలను రాజ్యాంగ పరిరక్షణలో కొనసాగిస్తామని పునరుద్ఘాటిస్తున్నారు.