తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీసులు జిల్లా వ్యాప్తంగా తప్పు దారిలో ప్రయాణించి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.తనిఖీల్లో తప్పుడు మార్గాల్లో నడిచి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. డ్రైవర్లకు రోడ్డు నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో పోలీసులు అవగాహన కల్పించారు.ప్రజల భద్రత కోసం తప్పు దారి డ్రైవింగ్‌పై ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.