తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లాఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సోమశేఖర్ సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు మరియు ఈ-కాప్స్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్ పనులు, కార్యాలయ రికార్డుల నిర్వహణ, ఈ-కాప్స్ డేటా ఎంట్రీ ప్రక్రియలను సీఐ సమీక్షించారు.ఈ సందర్భంగా రికార్డులను సకాలంలో నవీకరించాలని, డేటా ఎంట్రీలో ఖచ్చితత్వం పాటించాలని సిబ్బందికి సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని, కార్యాలయ పనులు సమర్థవంతంగా సాగేందుకు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందించడమే పోలీస్ శాఖ లక్ష్యమని సీఐ పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *