తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసు శాఖ రాత్రి బీట్‌లు మరియు నైట్ మానిటరింగ్‌ను పటిష్టం చేస్తోంది. రాత్రిపూట ముఖ్య రహదారులు, కాలనీలు, వాణిజ్య ప్రాంతాల్లో పోలీసులు క్రమం తప్పని విధంగా పహరా నిర్వహిస్తూ నిఘాను మరింతగా పెంచుతున్నారు.పోలీసులు రాత్రి వేళల్లో నేరాలను అరికట్టేందుకు, ప్రజలు భద్రతగా ఉండేలా చర్యలను వేగవంతం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సమాజంలో శాంతి-భద్రతలను కాపాడేందుకు పోలీస్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *